సంగారెడ్డి, జూలై 25
పిల్లల రక్షణలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.భవానీ చంద్ర అన్నారు. జాతీయ న్యాయ సేవా సంస్థ రూపొందించిన "చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ టు చిల్డ్రన్స్ స్కీమ్ –2024" అమలులో భాగంగా, సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నియమితులైన చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, జిల్లా విద్యాశాఖ సమన్వయంతో కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం ఒక రోజు సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించారు.
పిల్లల జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.భవానీ చంద్ర అన్నారు. జాతీయ న్యాయ సేవా సంస్థ రూపొందించిన "చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ టు చిల్డ్రన్స్ స్కీమ్ –2024" మరియు తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖతో కుదిరిన అవగాహన ఒప్పందం అమలులో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నియమితులైన చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు ఒక రోజు సెన్సిటైజేషన్ కార్యక్రమాన్ని శనివారం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో, జిల్లా విద్యాశాఖ సమన్వయంతో కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు.
జిల్లాలోని 239 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 239 మంది ఉపాధ్యాయులను చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.భవానీచంద్ర మాట్లాడుతూ ప్రతి చిన్నారికి సురక్షితమైన, భయ, హింస రహితమైన విద్యా వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు సమర్థవంతంగా పని చేస్తే బాలల రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి మాట్లాడుతూ బాలల భద్రతకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఉపాధ్యాయులు అత్యంత బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి బి.సౌజన్య, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.సంజీవ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రాజారెడ్డి, వివిధ శాఖల అధికారులు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.









