సంగారెడ్డి, జూలై 25
నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, లోక్సభ ప్రతిపక్ష నాయకులు చేపట్టిన ఆందోళనలు ఫలించాయని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని పటాన్ చెరు ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ప్రియంక గాంధీలు చేపట్టిన ఆందోళనలు ఫలించాయని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని పటాన్ చెరు ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
శనివారం ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో విద్యార్థులు నిర్వహించిన నిరసనలతో పాటు లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టిన ఆందోళనలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాయని అన్నారు.
నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలు, ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలపై విద్యార్థులు న్యాయం కోరుతూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారని గుర్తు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడి పడి ఉన్న పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యత తప్పని సరిగా ఉండాలని ఆయన అన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.









