రానున్న గోదావరి నదీ పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆదేశించారు.
నేడు సచివాలయంలో జరిగిన గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 8 జిల్లాల్లో గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఉందని, పుష్కర స్నానాలకై పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, తగిన ఏర్పాట్లు చేయాలని సి.ఎస్. సూచించారు.
ముఖ్యమంత్రి సూచనల మేరకు, పుష్కర ఏర్పాట్లపై ప్రతిపాదనలను రూపొందించి, కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
పుష్కర పనులపై నియమించిన ఈ.ఎన్.సి.లు, చీఫ్ ఇంజనీర్ల కమిటీ ప్రతిపాదిత పనులను పరిశీలించాలని కూడా ప్రధాన కార్యదర్శి సూచించారు.











