సంగారెడ్డి, జూలై 13
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (టీయుడబ్ల్యూజే ఐజేయు) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన బండారు యాదగిరిని బీఆర్ఎస్ శాసన సభా పక్ష ఉప నేత హరీష్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సోమవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. సంగారెడ్డిలోని చింత ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (టీయుడబ్ల్యూజే ఐజేయు) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన బండారు యాదగిరిని బీఆర్ఎస్ శాసన సభా పక్ష ఉప నేత హరీష్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సోమవారం సాయంత్రం శాలువాతో సత్కరించారు.
సంగారెడ్డిలోని చింత ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో, టీయుడబ్ల్యూజే ఐజేయు నూతన కార్యవర్గ ఎన్నిక, జిల్లా మహాసభ గురించి కొందరు నాయకులు హరీష్ రావుకు సమాచారం అందించారు. వెంటనే అక్కడే ఉన్న జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరికి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి అభినందించారు. రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ఆయన భుజం తట్టారు.
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా శాలువా కప్పి బండారు యాదగిరిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శివకుమార్, టీఎన్జీవో రాష్ట్ర మాజీ నేత రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ నేతలు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్రెడ్డి, చింత సాయినాథ్, గోవర్ధన్ నాయక్, జీవి శ్రీనివాస్, షేక్ సాబేర్, శ్రీధర్ రెడ్డి, మల్లాగౌడ్, తదితరులు టీయుడబ్ల్యూజే ఐజేయు అధ్యక్షుడు బండారు యాదగిరికి శుభాకాంక్షలు తెలిపారు.












