తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సదాశివపేటలోని 12వ వార్డులో కౌన్సిలర్ పులిమామిడి మమత ఆధ్వర్యంలో జరిగింది. అర్హులైన మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
పీ.ఎం.ఆర్ గణేష్ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మార్కండేయ స్లం సమైఖ్యకు చెందిన ద్వాక్రా గ్రూప్ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ చీరలను అందుకున్నారు. కౌన్సిలర్ పులిమామిడి మమత చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పులిమామిడి మమత మాట్లాడుతూ, ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉండేలా చీరలను తయారు చేయించిందని, దీనికి గాను ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఆర్.పి.రుమాండ్ల శారద, ఎస్.హెచ్.జి (ఓబి) మాలె అనిత నిర్వహించారు. 12వ వార్డు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని కౌన్సిలర్ మమత హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు డ్వాక్రా మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.












