హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఒక వాచ్ షోరూమ్‌లో సుమారు రూ. 2 లక్షల విలువైన ఖరీదైన వాచీలను దొంగిలించిన 26 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రియుడికి పుట్టినరోజు కానుకగా ఇవ్వడానికి ఈ దొంగతనం చేసినట్లు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాకు చెందిన యువతి, తన ప్రియుడితో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఒక ప్రముఖ వాచ్ షోరూమ్‌కు వెళ్లింది. ప్రియుడిని కారులో కూర్చోబెట్టి, యువతి కస్టమర్‌గా షోరూమ్‌లోకి వెళ్లింది.
సేల్స్‌మెన్‌ను మాటల్లో పెట్టి, యువతి రెండు టీ-సాట్ (Tissot) వాచీలను తన హ్యాండ్‌బ్యాగ్‌లో వేసుకుని, అక్కడి నుండి పరారైంది. ఈ వాచీల విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని అంచనా.
వాచీలు కనిపించకపోవడంతో షోరూమ్ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. యువతి వచ్చిన కారు నంబర్ ఆధారంగా ఆమెను గుర్తించారు.
పోలీసులు ఖమ్మంలో ఆ యువతిని గుర్తించి అరెస్ట్ చేశారు. దొంగిలించిన వాచీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.











