కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. కామారెడ్డి టౌన్ ఎంఐఎం అధ్యక్షుడు ఇమ్రోస్ హైమద్, పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో, వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశయాలను నెరవేర్చే పార్టీ అని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ వైపు వస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసేవ పట్ల నిబద్ధతతో కాంగ్రెస్లో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన నాయకులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ చేరికల కార్యక్రమంలో మహమ్మద్ అబ్దుల్, మహమ్మద్ ఆమేద్, జమీల్, అలీతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు గడ్డమీది మహేష్, మాజీ కౌన్సిలర్లు పిడుగు సాయిబాబా, జమీల్, సలీం, బల్ల శ్రీనివాస్, బండారి శ్రీకాంత్, రాహుల్, ఆకాష్, శశి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి పట్టణంలో ఎంఐఎం నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.












