కవాడిగూడలోని ఒక స్పా సెంటర్లో పనిచేస్తున్న బ్యూటీషియన్ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనలో ఆమె భర్తను పోలీసులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోవడంతో అదుపులోకి తీసుకున్నారు.
బహదూర్ పూర్ కిషన్ బాగ్ ప్రాంతానికి చెందిన బంగి దేబోరా, కవాడిగూడలో గల ఒక స్పా సెంటర్లో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయం తన భర్తతో గొడవపడిన తర్వాత ఆమె స్పా సెంటర్‌కు వచ్చింది.
ఆమె వచ్చిన కొద్దిసేపటికే, భర్త స్పా సెంటర్‌కు చేరుకుని, వెంట తెచ్చుకున్న కత్తితో బంగి దేబోరాపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించింది.
హత్య అనంతరం నిందితుడు సంఘటనా స్థలం నుంచి పారిపోయినప్పటికీ, కొద్దిసేపటికే అతను అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు అధికారులు ధృవీకరించారు.
పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.










