రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే డ్రగ్స్‌తో పట్టుబడటం బాధాకరమని దరిపల్లి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ప్రతిపక్ష పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, యువతకు ఎలాంటి సందేశాన్నిస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని ఆయన అన్నారు.
ఈ డ్రగ్స్ నెక్సస్‌లో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపై సమాచారం ఇవ్వాలని రాజశేఖర్ రెడ్డి కేటీఆర్‌ను కోరారు. అందించే సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
యువత, విద్యార్థుల జీవితాలను, కుటుంబాలను మానసికంగా, ఆర్థికంగా కృంగదీస్తున్న డ్రగ్స్ మాఫియాను పూర్తిగా అంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ దిశగా ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రతిపక్షాల నుంచి సహకారం ఆశిస్తున్నట్లు తెలిపారు.
డ్రగ్స్ నిర్మూలన ఒక సామాజిక బాధ్యత అని, ఈ విషయంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాజశేఖర్ రెడ్డి సూచించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే డ్రగ్స్ కేసు వ్యవహారంపై ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు.









