నిజామాబాద్, 2026-08-05
ఊపిరితిత్తులు, అన్నవాహిక, ఛాతీ మధ్యభాగం, డయాఫ్రం, ఛాతీ గోడకు సంబంధించిన క్లిష్ట వ్యాధుల చికిత్సలో మినిమల్లీ ఇన్వాసివ్ థొరాసిక్ సర్జరీ విధానాలు విశేష ఫలితాలనిస్తున్నాయని నిజామాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. , వంటి సాంకేతికతలతో రోగులు తక్కువ సమయంలోనే కోలుకుంటున్నారని వివరించారు.
ఊపిరితిత్తులు, అన్నవాహిక, ఛాతీ మధ్యభాగం (మీడియాస్టినమ్), డయాఫ్రం, ఛాతీ గోడకు సంబంధించిన క్లిష్ట వ్యాధుల చికిత్సలో ఆధునిక మినిమల్లీ ఇన్వాసివ్ థొరాసిక్ సర్జరీ విధానాలు విశేష ఫలితాలను ఇస్తున్నాయని సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వీడియో అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీ (వాట్స్), రోబోటిక్ అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీ (రాట్స్) సాంకేతికతలతో నిర్వహించే శస్త్రచికిత్సల వల్ల రోగులు తక్కువ సమయంలోనే కోలుకోవడంతో పాటు నొప్పి, రక్తస్రావం, ఆసుపత్రిలో ఉండే రోజుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోందని వివరించారు.
థొరాసిక్ సర్జరీ అంటే ఏమిటి
థొరాసిక్ సర్జరీ అనేది గుండెను మినహాయించి ఛాతీ భాగంలోని ఇతర అవయవాలకు సంబంధించిన వ్యాధులకు నిర్వహించే ప్రత్యేక శస్త్రచికిత్స అని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి శస్త్రచికిత్సల కోసం ఛాతీని పూర్తిగా తెరవాల్సి వచ్చేదని, ప్రస్తుతం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిన్న కోత లేదా చిన్న రంధ్రం ద్వారానే శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. దీంతో రోగులు త్వరగా కోలుకుని సాధారణ జీవన విధానంలోకి చేరుతున్నారని వెల్లడించారు.
వైద్యుల అభిప్రాయం
యశోద ఆసుపత్రుల థొరాసిక్ సర్జన్ డాక్టర్ రోహన్ రెడ్డి సి మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో థొరాసిక్ శస్త్రచికిత్సల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. చిన్న కోతలు, రోబోటిక్ సాంకేతికతతో అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను కూడా కచ్చితత్వంతో నిర్వహించే అవకాశం ఏర్పడిందన్నారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, వివిధ విభాగాల వైద్యుల సమన్వయంతో రోగులకు ఉత్తమ చికిత్స అందించడం సాధ్యమవుతోందని తెలిపారు. ప్రతి రోగి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారి అవసరాలకు అనుగుణంగా చికిత్స అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
సమగ్ర వైద్య సేవలు
అత్యాధునిక శస్త్రచికిత్స గదులు, హై-డెఫినిషన్ ఇమేజింగ్ వ్యవస్థలు, రోబోటిక్ శస్త్రచికిత్స పరికరాలు, థొరాసిక్ సర్జన్లు, పల్మనాలజిస్టులు, క్యాన్సర్ నిపుణులు, రేడియాలజిస్టులు, అనస్థీషియా వైద్యులు, క్రిటికల్ కేర్ నిపుణులతో కూడిన బృందం సహకారంతో యశోద ఆసుపత్రులు సమగ్ర వైద్య సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ప్రారంభ దశలోని ఊపిరితిత్తుల క్యాన్సర్, అన్నవాహిక వ్యాధుల నుంచి క్లిష్టమైన ఛాతీ అత్యవసర సమస్యల వరకు శాస్త్రీయ ఆధారాలతో కూడిన వైద్య విధానాల ద్వారా చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు.












