పూర్వపు నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, గృహనిర్మాణ పురోగతి మరియు రెవెన్యూ సమస్యలపై రెవెన్యూ, సమాచార, హోసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం 27.04.2026న హైదరాబాద్లో జరగనుంది.
రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల సమస్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశం 27.04.2026 ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని టీజీఎస్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో జరగనుంది. ఈ సందర్భంగా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
మరోవైపు, శుక్రవారం కలెక్టర్ సంబంధిత అధికారులతో ఒక మినీ సమావేశం నిర్వహించి, ఇందిరమ్మ ఇళ్ళు, భూ భారతి పెండింగ్ దరఖాస్తుల పురోగతిపై ఆరా తీశారు. పెండింగ్ దరఖాస్తులపై సమగ్ర నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. ఈ మినీ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, రెవెన్యూ, హోసింగ్, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పెండింగ్ పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించారు.












