జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి-65పై రోడ్డు విస్తరణ పనులపై సమీక్ష నిర్వహించారు.
సంగారెడ్డి నుండి పటాన్చెరు వరకు జాతీయ రహదారి-65పై కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ శుక్రవారం పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులతో కలిసి రోడ్డు నిర్మాణ పనులు, వాటర్ లాగింగ్ పాయింట్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గత ఏడాది ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో పని చేయాలని ఆయన సూచించారు.
జిల్లా కలెక్టర్, ప్రమాదాలకు ఆస్కారం ఉన్న బ్లాక్ స్పాట్ల వద్ద తాత్కాలిక భద్రతా ఏర్పాట్లు చేయాలని, రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీలపై స్లాబులు ఏర్పాటు చేయాలని తెలిపారు. అవసరమైన చోట వాటర్ పైప్లైన్లను వెంటనే షిఫ్ట్ చేయాలని ఆయన సూచించారు.
విద్యుత్ శాఖ అధికారులకు, రోడ్డు విస్తరణ పనులకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తక్షణమే తరలించాలని ఆదేశించిన కలెక్టర్, యుటిలిటీల షిఫ్టింగ్ పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.








