నిజామాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్‌రాజు, జూలై 1నుంచి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రకటించారు.
నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్‌రాజు తెలిపారు.
వాహనదారులకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ వినియోగం వంటి నియమాలను ఉల్లంఘించిన వారికి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు.
ప్రజల ప్రాణ భద్రత కోసం ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.












