సంగారెడ్డి, జూలై 24
నీట్ పేపర్ లీకేజీ ఘటన బాధితులపై చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా సంగారెడ్డిలో మూడో రోజు ఆందోళనలు కొనసాగాయి. ప్రజల పక్షాన నిలుస్తున్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం ఆటవికపు చర్య అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీట్ పేపర్ లీకేజీ ఘటన బాధితులపై చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన నిరసనలకు మద్దతుగా సంగారెడ్డిలో మూడో రోజు ఆందోళనలు కొనసాగాయి. ప్రజల పక్షాన నిలుస్తున్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం ఆటవికపు చర్య అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ నేతలను నిర్బంధించి, పార్లమెంటులో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలో, నీట్ పరీక్ష రాసిన విద్యార్థులతో పాటు రాహుల్ గాంధీకి మద్దతుగా సంగారెడ్డిలో 1000 మందితో మహా పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, టిపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్, కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు, కూన సంతోష్, రామ్ రెడ్డి, కిరణ్ గౌడ్, షఫీ అహ్మద్, జార్జ్ తదితరులు పాల్గొన్నారు.












