నగరంలోని ప్రెస్ క్లబ్లో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జర్నలిస్టులు, వివిధ సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని, రంగులు చల్లుకుంటూ, పాటలకు నృత్యాలు చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన హోలీ వేడుకల్లో జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు, అర్బన్ రిపోర్టర్లు, ఎడిటర్స్ అసోసియేషన్ సభ్యులు, వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు, సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ప్రెస్ క్లబ్ వేదికగా కులమతాలకు అతీతంగా పండగలను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే హోలీని ఐక్యంగా జరుపుకున్నామని తెలిపారు. జర్నలిస్టులందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
సీనియర్ జర్నలిస్ట్ బొబ్బిలి నరసయ్య మాట్లాడుతూ, జర్నలిస్టులు ఐక్యతతో ముందుకు సాగుతూ అన్ని పండగలను ఆనందంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ఇది జర్నలిస్టుల మధ్య సఖ్యతను పెంపొందించేలా ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజ్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.రాజు, కమిటీ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసికట్టుగా పండుగను జరుపుకోవడం విశేషం.

