సంగారెడ్డి, జూలై 2, 2026
ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ ప్రసాద్లో యూరియా ఎరువులను పారదర్శకంగా, సకాలంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 5, 2026 నుంచి యూరియా బుకింగ్ యాప్ ద్వారా పంపిణీ విధానాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో 2,89,963 యూరియా బస్తాలు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ ప్రసాద్ తెలిపారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా ఎరువులను పారదర్శకంగా, సకాలంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 5, 2026 నుంచి యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా పంపిణీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ ప్రసాద్ తెలిపారు.
జిల్లాలో 2,89,963 యూరియా బస్తాలు రైతుల అవసరాలకు అనుగుణంగా సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. సంగారెడ్డి మండలాల వారీగా యూరియా నిల్వల వివరాలు (02-07-2026 నాటికి) వెల్లడించారు. నారాయణఖేడ్ 16,434 బస్తాలు, రాయికోడ్ 12,946 బస్తాలు, పటాన్చెరు 11,964 బస్తాలు, గుమ్మడిదల 7,004 బస్తాలు, మునిపల్లి 4,926 బస్తాలు, జహీరాబాద్ 4,882 బస్తాలు, అందోల్ 4,576 బస్తాలు, కోహీర్ 4,053 బస్తాలు, జిన్నారం 4,033 బస్తాలు, హత్నూర 3,495 బస్తాలు – ఈ 10 మండలాల్లో మొత్తం 74,313 బస్తాలు నిల్వ ఉన్నాయి.
ఇతర మండలాల్లో 28,904 బస్తాలు, జిల్లాలో మొత్తం 1,03,217 బస్తాలు ప్రస్తుతం వివిధ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా రైతులు ముందుగానే యూరియాను బుక్ చేసుకోవచ్చని, బుక్ చేసిన తర్వాత వారికి కేటాయించిన ఎరువుల దుకాణంలో యూరియాను పొందవచ్చని పేర్కొన్నారు. బుకింగ్ చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోపు యూరియాను తప్పనిసరిగా పొందాలని సూచించారు.
రైతులు యూరియా బుకింగ్ కోసం సమీప వ్యవసాయ విస్తరణ అధికారి (AEO), రైతు వేదికలు, మీ సేవ కేంద్రాలు లేదా అధీకృత ఎరువుల దుకాణాలను సంప్రదించాలని అధికారులు సూచించారు. రైతులు అవసరమైన మేరకే యూరియాను కొనుగోలు చేయాలని, అనవసరంగా నిల్వ చేసుకోవద్దని, యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని మాత్రమే యూరియాను పొందాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు.
రైతులకు అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉన్నందున ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శివప్రసాద్ తెలిపారు.












