ప్రధాని నరేంద్ర మోడీ, మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, రూ. 9,400 కోట్ల విలువైన వివిధ మౌలిక సదుపాయాలు మరియు పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ప్రధాని మోడీ పర్యటనలో భాగంగా, రూ. 2,360 కోట్లతో జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు.
బీజేపీ శ్రేణులు ప్రధాని పర్యటనను పురస్కరించుకుని విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. గోడలపై రాతలు, బైక్ ర్యాలీలు, ఇతర కార్యక్రమాల ద్వారా ప్రజలను సభకు తరలిరావాలని కోరుతున్నారు.
వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని, సభా ప్రాంగణంలో జర్మన్ టెంట్లు ఏర్పాటు చేశారు. ప్రజలకు మంచినీరు, మజ్జిగ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. జన సమీకరణ కోసం ప్రత్యేక రైళ్లు, బస్సులను కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.










