సంత్ శిరోమణి గురు రవిదాస్ 650వ జయంతి ఉత్సవం సందర్భంగా సామాజిక సమరసతా వేదిక గజ్వేల్లో క్యాలెండర్ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి డాక్టర్ ఆకుల నరేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరైనారు. గజ్వేల్ ఏసీపీ నరసింహులు క్యాలెండర్ను ఆవిష్కరించారు.
డాక్టర్ ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ, సంత్ రవిదాస్ మహారాజ్ సమానత్వం, మానవత్వం, సోదరభావం కోసం జీవితాంతం కృషి చేశారని తెలిపారు.
అనంతరం, సంత్ రవిదాస్ బోధనలకు ఆకర్షితుడైన పీర్ సద్న తన పేరును రామదాసుగా మార్చుకుని రవిదాస్ శిష్యుడిగా మారాడని వివరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.







