కామారెడ్డి, 10.07.2026
తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన ప్రణాళికల అమలుపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు కామారెడ్డిలో ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఈ శిబిరానికి హాజరై, అభివృద్ధి ప్రణాళికలు, నిధుల వినియోగం, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై మార్గనిర్దేశం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా జిల్లాలోని మూడు డివిజన్ కేంద్రాలలో సంబంధిత గ్రామ సర్పంచులు, కార్యదర్శులకు ఈరోజు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. కామారెడ్డి మున్సిపల్ కళాభారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హాజరై, సర్పంచులను, కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
కళాభారతి ఆడిటోరియం, కామారెడ్డి వేదికగా జరిగిన ఈ శిక్షణలో కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళికను 2026-27, 2027-28, 2028-29 సంవత్సరాల కొరకు ప్రజలను, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి అధికారుల భాగస్వామ్యంతో తయారు చేయాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించడం, నిధుల పారదర్శక వినియోగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఈ శిక్షణలో వివరణాత్మకంగా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
"గ్రామ పంచాయతీయే గ్రామీణాభివృద్ధికి మూలం. సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి, ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉంది. శిక్షణలో చెప్పే అంశాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అమలు చేయాలి" అని కలెక్టర్ సూచించారు. V BGIRAM G పథకాన్ని ఉపయోగించి పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టాలని, 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, ప్రణాళిక పారదర్శకంగా ఉండాలని ఆయన తెలిపారు.
గ్రామ పంచాయతీలు తమ స్వంత ఆదాయాన్ని పెంచుకొని, 16వ ఆర్థిక సంఘం నుంచి 10% పెర్ఫార్మెన్స్ గ్రాంట్ పొందాలని కలెక్టర్ సూచించారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి 10 స్థానాల్లో నిలిచిందని, రెండవ విడతలో HUT FREE జిల్లాగా మార్చడానికి సర్పంచులు సహకరించాలని కోరారు. బడిబాట కార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లా 4వ స్థానంలో ఉందని, దీనిని మొదటి స్థానానికి తీసుకురావడానికి జిల్లాలోని సర్పంచులు ప్రభుత్వ పాఠశాలల్లో నవోదయ సంఖ్యను పెంచాలని ఆయన కోరారు.
ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం, కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ACLB. NY గిరి, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డిపిఓ మురళి, డిఆర్డిఓ దామోదర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, డిఎల్పిఓ శ్రీనివాస్, ఎంపీడీవోలు, జిల్లా అధికారులు, సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీలు పాల్గొన్నారు.











