సంగారెడ్డి, జూలై 12
ఆందోల్ నియోజకవర్గంలోని మునిపల్లి, రాయికోడ్ మండలాలలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వీడాలని, విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆందోల్ నియోజకవర్గంలోని మునిపల్లి, రాయికోడ్ మండలాలలో సుడిగాలి పర్యటన చేశారు.
మునిపల్లి, రాయికోడ్ మండలాల కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ కు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై నిర్లక్ష్యం వీడాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు.
క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) అనుభవాలను, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను పూరించడంలో ఓటర్లకు అవసరమైన సహాయం అందించాలని BLA లకు మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలన్నారు. అందుకు అవసరమైన అవగాహనను ఓటర్లకు కల్పించేలా BLA లు కృషి చేయాలని మంత్రి కోరారు.
ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో అలసత్వం లేకుండా బూత్ వారీగా రోజువారి లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. ఓటర్లతో సమన్వయ చేసుకొని గడువులోగా (జూలై -24) SIR ప్రక్రియను పూర్తిచేసి ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ కోసం బూత్ లెవెల్ అధికారుల (BLO) లకు అందించాలన్నారు. BLA లు బూతుల వారీగా సమన్వయం చేసుకొని సహకరించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో PCC డాక్టర్స్ సెల్ చైర్మన్ డా. రాజీవ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జగన్ మోహన్ రెడ్డి, సతీష్, సుధాకర్ రెడ్డి, రాంరెడ్డి, కేదార్నాథ్, సతీష్, సిద్దన్న పటేల్, బసవరాజు పాటిల్, మహంకాళి తదితరులు పాల్గొన్నారు.












