నర్సాపూర్ పట్టణంలో కోతులతో ప్రజల ఇబ్బందులు

మెదక్/నర్సాపూర్, అక్టోబర్ 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో వానరాల సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం నర్సాపూర్ ఎన్జీఓఎస్ కాలనీలో కోతుల గుంపులు గుంపులుగా తిరుగుతూ కాలనీవాసులను భయభ్రాంతులకు గురి చేశాయి. పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలలోనూ కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నారులు స్కూల్‌కి వెళ్ళే, వచ్చే సమయంలో దాడి చేసే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల కోతులు పండ్ల దుకాణాలు, ఇళ్లపైకి ఎగబాకి ఆస్తి నష్టం కలిగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వానర మూకల నియంత్రణకు శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించి పట్టణ ప్రజలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Join WhatsApp

Join Now

Leave a Comment