Site icon PRASHNA AYUDHAM

నామినేషన్ దాఖలాకు ముందు తప్పనిసరిగా పరిశీలించాల్సిన అంశాలు

IMG 20251126 WA0023

నామినేషన్ దాఖలాకు ముందు తప్పనిసరిగా పరిశీలించాల్సిన అంశాలు

అభ్యర్థులు పాటించాల్సిన నియమాలు, జతపరచాల్సిన పత్రాల జాబితా విడుదల

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 26 

గ్రామ పంచాయతి ఎన్నికల నామినేషన్ దాఖలాకు ముందు ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్య అంశాలను అధికారులు స్పష్టం చేశారు. నామినేషన్ సమయంలో పత్రాలు, సంతకాలు, అఫిడవిట్లలో తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

✓ అభ్యర్థి అర్హతలు, అవసరమైన పత్రాలు

1. అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాలు పూర్తిగా నిండివుండాలి.

2. ఆయన/ఆమె సంబంధిత ఓటరు జాబితాలో ఓటరుగా నమోదు అయి ఉండటం తప్పనిసరి.

3. SC/ST/BC వర్గాలకు చెందినవారైతే కుల (Caste) సర్టిఫికేట్‌ను జత చేయాలి.

4. నామినేషన్ ఫీజు/డిపాజిట్ మొత్తాన్ని చెల్లించాలి.

5. నేర చరిత్ర, స్థిరాస్తులు, విద్యార్హతల వివరాలతో కూడిన అఫిడవిట్‌ను ఇద్దరు సాక్షుల సంతకాలతో సమర్పించాలి.

6. ఎన్నికల ఖర్చులను నిబంధనల ప్రకారం నిర్వహిస్తానని అంగీకార పత్రం (Expenditure Declaration) ఇవ్వాలి.

7. అభ్యర్థి పోటీ చేస్తున్న స్థానానికి చెందిన ఓటరే ప్రతిపాదకుడిగా ఉండాలి.

✓ నామినేషన్ పత్రంలో తప్పనిసరి సంతకాలు

A) PART–1 : ప్రతిపాదకుడి సంతకం

B) PART–2 : అభ్యర్థి సంతకం

C) PART–3 : అభ్యర్థి సంతకం

D) PART–4 : రిటర్నింగ్ ఆఫీసర్ (RO) సంతకం

E) PART–5 : తిరస్కరణ కారణాలు — RO సంతకం

F) PART–6 : రసీదు — RO సంతకం

✓ అఫిడవిట్ & డిక్లరేషన్

– అఫిడవిట్‌లో ఇద్దరు సాక్షుల సంతకం, అభ్యర్థి సంతకం తప్పనిసరి.

– Expenditure Declaration పై అభ్యర్థి సంతకం ఉండాలి.

ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ పత్రాలలో చిన్న తప్పిదం కూడా తిరస్కరణకు దారితీసే అవకాశముండటం వల్ల అభ్యర్థులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Exit mobile version