ఖమ్మం నగరంలో ఖమ్మం రెండవ పట్టణ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ శిబిరం శనివారం విజయవంతంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎన్ఎస్పి క్యాంపులోని రామాలయం ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమానికి టూ టౌన్ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ అధ్యక్షత వహించారు. ఈ శిబిరంలో సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసు దేవరావు ముఖ్య వక్తలుగా హాజరయ్యారు.
పార్టీ సిద్ధాంతాలు, సంఘటిత శక్తి, కార్యకర్తల పాత్ర, ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాలపై ముఖ్య వక్తలు కార్యకర్తలకు వివరణాత్మకంగా మార్గనిర్దేశం చేశారు. ఇది పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేలా ఉందని నిర్వాహకులు తెలిపారు.
మండదపు సుబ్బారావు, వేల్పుల సుధాకర్, రుద్రగాని మాధవ, శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి శ్రీలత, శ్రీమతి ఉపేందరమ్మ, నాగరాజు, రవి రాదోడ్, మట్ట దుర్గప్రసాద్, దాసరి వీరభద్రం (రిటైర్డ్ సి.ఐ), రవి గౌడ్, టి వీర భద్రం తదితరులు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

