సంగారెడ్డి, జూలై 20
వట్ పల్లి మండల కేంద్రంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. రూ.300 కోట్ల నిధులతో అల్లాదుర్గ్–మెటల్కుంట, జోగిపేట–వట్ పల్లి, భూత్కూర్–వట్ పల్లి రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు కావడాన్ని వారు అభినందించారు.
వట్ పల్లి మండల కేంద్రంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎన్ ఎస్ యూఐ నియోజకవర్గ అధ్యక్షుడు ఖాజా మాట్లాడుతూ, వట్ పల్లి మండల ప్రజల చిరకాల కోరిక అయిన అల్లాదుర్గ్–మెటల్కుంట, జోగిపేట–వట్ పల్లి, భూత్కూర్–వట్ పల్లి రహదారుల అభివృద్ధికి దాదాపు రూ.300 కోట్ల నిధులు మంజూరు చేయడం మంత్రి దామోదర్ రాజనర్సింహ అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.
మంత్రి కృషి వల్ల వట్ పల్లి మండలానికి మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, ప్రజల ప్రయాణం సులభతరం కావడంతో పాటు మండల అభివృద్ధికి ఈ రహదారులు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి చిత్రపటానికి వట్ పల్లి మండల కేంద్రంలో పాలాభిషేకం నిర్వహించారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ నాయకత్వంలో వట్ పల్లి మండలానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందాలని ఆకాంక్షిస్తూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఆయన సేవలు నిరంతరం కొనసాగాలని కోరారు.










