సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జన్మదిన వేడుకలను పట్టణంలో అభిమానులు, నాయకులు ఘనంగా నిర్వహించారు.
మంగళవారం జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులు, పార్టీ నాయకులు ఆయనకు గజమాలతో స్వాగతం పలికి, భారీ ర్యాలీని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్వయంగా కేక్ కట్ చేసి, తన జన్మదినాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ వేడుకలకు పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు తమ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం పట్టణంలో సందడిగా సాగింది.








