నర్సాపూర్, జూలై 31
నర్సాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ నిరంజన్ దాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు ఆయనకు ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
నర్సాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ నిరంజన్ దాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీరారెడ్డి ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిరంజన్ దాస్ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చెష్ యాదవ్, కౌన్సిలర్ శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్ గోడ రాజేందర్, బీజేపీ జిల్లా కార్యదర్శి బాదే బాలరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి సంగసాని రాజు, సిద్దు, మనోజ్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా నిరంజన్ దాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.












