కామారెడ్డి, 2026-07-12
పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం బీడీ పెన్షన్ అందజేయాలని టిఆర్ఎస్ సదాశివనగర్ మండల అధ్యక్షుడు కలాలి సాయ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం సదాశివనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.
పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం బీడీ పెన్షన్ అందజేయాలని టిఆర్ఎస్ సదాశివనగర్ మండల అధ్యక్షుడు కలాలి సాయ గౌడ్ అన్నారు. ఆదివారం సదాశివనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
పీఎఫ్ కార్డు ఉన్న కట్ అప్ డేట్ తొలగించకపోవడంతో ఏళ్ల తరబడి బీడీ పెన్షన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఇప్పటివరకు ఉన్న ప్రతి పీఎఫ్ బీడీ కార్మికురాలికి పెన్షన్ అందజేయాలన్నారు.
తెలంగాణ సాధించుకున్న రాష్ట్రంలో బీడీ కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, ఒకవైపు బీడీ కార్మికులను కంపెనీలు మోసం చేస్తూ రోడ్డున పడే పరిస్థితి నెలకొందని కలాలి సాయ గౌడ్ పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పీఎఫ్ కార్డు ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి బీడీ పెన్షన్ అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ అధ్యక్షుడు మోసర్ల శ్రీకాంత్ రెడ్డి, కుప్రియల్ గ్రామ అధ్యక్షుడు చాకలి లింగం, ఎస్సీ సెల్ మండల నాయకులు జంగంగారి సాయిలు, సడిమేలా నర్సింలు తదితరులు పాల్గొన్నారు.











