సంగారెడ్డి, జూలై 4
సదాశివపేట పట్టణంలోని 12వ వార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న SIR (సర్) కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పులిమామిడి రాజు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని, ఎన్యూమరేషన్ ఫామ్స్ అందరికి అందుతున్నాయా అని బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు.
సదాశివపేట పట్టణంలోని 12వ వార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న SIR (సర్) కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పులిమామిడి రాజు పాల్గొన్నారు. పులిమామిడి రాజు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఎన్యూమరేషన్ ఫామ్స్ అందరికి అందుతున్నాయా అన్న సమాచారాన్ని బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా తాను కూడా వారితో కలిసి వార్డు ప్రజలకు ఎన్యూమరేషన్ ఫామ్స్ స్వయంగా అందజేశారు.
ఈ ప్రాముఖ్యతను 12వ వార్డు ప్రజలకు వివరిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా SIR సర్వే ఎంతో కీలకమని అన్నారు. ప్రజలు అధికారులకు పూర్తిగా సహకరించి సర్ (SIR) ను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, వార్డు నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












