నిజామాబాద్, జూలై 22
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల్లో భాగంగా నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ నాయకులు, ట్రాన్స్జెండర్ ప్రతినిధులు నిరసన చేపట్టారు. ఈ నిరసనకు డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ నాయకత్వం వహించారు.
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల్లో భాగంగా నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ నాయకులు, ట్రాన్స్జెండర్ ప్రతినిధులు నిరసన చేపట్టారు.
నగరంలోని 11వ డివిజన్ బహుజన్ కాలనీలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటం వద్ద డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ట్రాన్స్జెండర్ ప్రతినిధులు జరీనా, గంగా తదితరులు తమ సంఘ సభ్యులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. డీసీసీ కార్పొరేషన్ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై కేంద్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.
నీట్ పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ప్రజాస్వామ్య స్వరాన్ని అణచివేసే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. న్యాయం, జవాబుదారీతనం కోసం జరిగే ప్రజాస్వామ్య పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
నిరసనలో భాగంగా బొబ్బిలి రామకృష్ణతో పాటు కాంగ్రెస్ నాయకులు ప్రతీకాత్మకంగా ఒకరి చేతులకు మరొకరు తాడుతో సంకెళ్లు వేసుకుని తమ నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, కార్పొరేటర్లు కరీం, అన్వర్, నయీం, నవాజ్, ముదసిర్, అవీన్ తదితరులు పాల్గొన్నారు.











