సంగారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు 54 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ మాధురి తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్(రెవెన్యూ) మాధురి తెలిపారు.
ఈ పరీక్షలకు 35,986 మంది విద్యార్థులు హాజరవుతారని, 54 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయని ఆమె పేర్కొన్నారు.
ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ఆదివారాలు కూడా కలుపుకొని రెండు సెషన్లలో నిర్వహించబడతాయని తెలిపారు.
పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించబడతాయని, పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలని ఆదేశించారు.







