సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు పట్టణంలో పలు కార్యక్రమాలకు హాజరైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ యువ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదివారం పటాన్ చెరు లోని ఐబీ అతిథి గృహంలో ప్రవీణ్ కుమార్ ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పటాన్ చెరు, సమాజ సేవా కార్యక్రమాలు, యువత భవిష్యత్లో పాల్గొనవలసిన పాత్ర, ప్రజల సమస్యల పరిష్కారం వంటి అనేక ముఖ్య అంశాలపై చర్చలు జరిపారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సమాజం పట్ల ఉన్న కృషి, ఆలోచనా విధానం గురించి మాదిరి పృథ్వీరాజ్ ప్రశంసలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువత, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రవీణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మాదిరి ప్రిథ్వీరాజ్
Published On: August 24, 2025 7:49 pm