నేడు బోజన విరామ సమయములో నల్ల బ్యాడ్జి లతో నిరసన
– ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్రఅధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా భోజనం విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చవాన్ సుభాన్ సింగ్ లు ఒక ప్రకటనలో తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం,తుక్కు గూడ హై పాఠశాల లో దళిత హెడ్ మాస్టర్ రాములు పై సభ్య సమాజం సిగ్గు పడేలా దాడి చేసి హెడ్ మాస్టర్ చేత విద్యార్థి కాళ్ళు మొక్కిచ్చిన దుండగుల పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని,భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం పాఠశాలల్లో నల్ల భ్యా డ్జి లు ధరించి నిరసన తెలుపాలన్నారు. ప్రధాన కార్యదర్శి చవాన్ సుభాన్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు అందరూ నిరసన తెలుపాలని ఓ ప్రకటనలో కోరారు.