సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్‌కు ప్రశంసలు అందుతున్నాయి. శుక్రవారం పటాన్ చెరులోని ఎండీఆర్ కార్యాలయంలో కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్కు ప్రశ్న ఆయుధం పత్రికలో ప్రచురితమైన వార్త కాపీని ఫోటో ఫ్రేమ్ రూపంలో ప్రశ్న ఆయుధం రిపోర్టర్ మహేష్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా మాదిరి ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ.. “మేము చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ప్రశ్న ఆయుధం పత్రికలో ప్రచురించడం ఆనందంగా ఉందని తెలిపారు. సమాజం కోసం మేము చేస్తున్న కృషిని గుర్తించి నలుగురికీ తెలియజేయడంలో మీడియా పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. అలాగే తమ సేవా ప్రయాణంలో సహకరిస్తున్న ఎండీఆర్ బృందం సభ్యుల సహకారంతో సేవలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీఆర్ సభ్యులు మధు తదితరులు పాల్గొన్నారు.
ఎండీఆర్ సేవలకు ప్రశంసలు..ప్రశ్న ఆయుధం పేపర్ లో ప్రచురణ
Published On: August 1, 2025 2:25 pm