సంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారిగా ఆర్.పాండు

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారిగా ఆర్. పాండు బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు అందోల్ ఆర్డీఓగా విధులు నిర్వహించిన పాండును ప్రభుత్వం జిల్లా రెవెన్యూ అధికారిగా నియమించింది. ఇది వరకు జిల్లా రెవెన్యూ అధికారిగా ఉన్న పద్మజారాణిని బదిలీపై, అదనపు కలెక్టర్ గా తన తదుపరి పోస్టింగ్ కోసం ప్రభుత్వం ముందు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment