సంగారెడ్డి, ఆగస్టు 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ ప్రతిష్టను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించారు. క్లబ్ డిస్ట్రిక్ట్ రీజియన్ కాలేజీ ఆర్డినేటర్, లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ సభ్యులు ఉషాశ్రీ, అనంతరావు కులకర్ణి దంపతులు అమెరికా పర్యటనలో భాగంగా ఒక్లహమా, టెక్సాస్ రాష్ట్రాలలోని లయన్స్ క్లబ్ ఆఫ్ ఒక్లహమా, ఒక్లహమా వెస్ట్ సైడ్ లయన్స్ క్లబ్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా వారు సంగారెడ్డి లయన్స్ క్లబ్ చేపడుతున్న విద్య, వైద్య, పర్యావరణ సేవా కార్యక్రమాలపై వివరాలు అందించారు. అమెరికా లయన్స్ సభ్యులు ఈ కార్యక్రమాలను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. గ్లోబల్ లయన్స్ ప్రధాన లక్ష్యాలు అయిన మధుమేహం, దృష్టి, ఆకలి నివారణ, పర్యావరణ పరిరక్షణ, బాల్య క్యాన్సర్ నివారణ వంటి అంశాలలో సంగారెడ్డి క్లబ్ చేస్తున్న కృషి ఆదర్శమని పేర్కొన్నారు. 2025–26 లయానిస్టిక్ సంవత్సరానికి ప్రతినెలా జరిగే సమావేశాలలో చేపట్టాల్సిన ప్రాజెక్టులను కూడా సమీక్షించారు. అమెరికా పర్యటనలో భాగంగా క్లబ్ అధ్యక్షుడు డేవిడ్ వుడ్డెల్, క్యాతేయ్ ట్యూటన్, కార్యదర్శి కాతే వాలెయ్, కోశాధికారి రిక్ డ్రమ్మండ్, లయన్ కిమ్ టైలర్ తదితరులు కులకర్ణి దంపతులను ఘనంగా ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంలో డిస్ట్రిక్ట్ చైర్మన్లు పి.రాములుగౌడ్, ఎస్.విజయందర్ రెడ్డి, డి.హనుమంతు గౌడ్, క్లబ్ అధ్యక్షుడు పి.రామక్రిష్ణారెడ్డి, జార్జ్ మాథ్యూ, వెంకటేశం, యన్.రామప్ప తదితరులు ఉషాశ్రీ–అనంతరావు దంపతులకు అభినందనలు తెలిపారు.