గుండెపోటుతో సీనియర్ జర్నలిస్ట్ మృతి.

గుండెపోటుతో సీనియర్ జర్నలిస్ట్ మృతి.

 

 

నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 11

 

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఓ ప్రముఖ దినపత్రిక లో గత కొద్ది సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న నారాయణ గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణం పట్ల నిజామాబాద్ జిల్లాకు చెందిన పలు సీనియర్ జర్నలిస్టులు వివిధ జర్నలిస్ట్ సంఘాలు సంతాపం తెలిపారు. అలాగే బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ప్రగాడ సానుభూతి తెలిపే సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా ఓ ప్రముఖ దినపత్రికలో వాస్తవాలు నిర్భయంగా రాస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ ఎన్నో వార్తా కథనాలు రాశారని ఆయన మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటు అని ఆయన తెలిపారు.

Join WhatsApp

Join Now