ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలి: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన స్టేజ్ టు, జోనల్ ఆఫీసర్ల శిక్షణ తరగతులు, సర్వీస్ ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్ కు ఏర్పాట్లు, వెబ్ కాస్టింగ్, ఓటర్ స్లిప్పుల పంపిణీ షెడ్యూల్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలు ముగిసే వరకు అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. అన్ని నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఆయా ఏర్పాట్లను జాగ్రత్తగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంసీసీ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని, ఎన్నికల నిబంధనలు అన్ని పాటిస్తున్నట్లు కమిషనర్ కు వివరించారు. అన్ని పనులు సజావుగా జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పి సీఈవో జానకి రెడ్డి, డీఈవో వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment