కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. ఈ మేళాలో వివిధ రంగాలకు చెందిన సంస్థలు పాల్గొని 40 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి.
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) సహకారంతో ఈ మేళాను నిర్వహించారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ, నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో టీటా చేస్తున్న కృషిని అభినందించారు. నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ఆమె తెలిపారు.
ఈ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, బి.టెక్, బీఎస్సీ అగ్రికల్చర్, హోటల్ మేనేజ్మెంట్, ఎంఎల్టీ వంటి అర్హతలు కలిగిన 18 నుండి 30 ఏళ్ల మధ్య వయస్సు గలవారు పాల్గొన్నారు. పలు కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేశాయి.
ఐటీ రంగంలో (AI/ML) 7 మంది, ఎంఎస్ఎన్ ఫార్మాలో 8 మంది, విజయ బయో అగ్రికల్చర్లో 22 మంది, బ్యాంకింగ్ రంగంలో 4 మంది ఉద్యోగాలు పొందారు. ఈ కార్యక్రమంలో పలు సంస్థల హెచ్ఆర్ మేనేజర్లు పాల్గొన్నారు.












