తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో మాట్లాడుతూ, కేంద్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టే దిశగా తమ ప్రయత్నాలున్నాయని, 2034 వరకు తెలంగాణలోనే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గాంధీ కుటుంబానికి దేశంపై విశ్వాసం ఉందని, కాంగ్రెస్ అగ్రనేతలతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని పేర్కొన్నారు. తన పరిధి మేరకు పనిచేస్తానని, పార్టీని వీడిన తర్వాత కూడా నాయకుల మధ్య సత్సంబంధాలు కొనసాగడం అరుదని అన్నారు.
దేశంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడమే రాహుల్ గాంధీ లక్ష్యమని, అయితే ప్రధాని పదవిని ఆశించలేదని ఆయన స్పష్టం చేశారు. వికారాబాద్లో జరిగిన సమావేశంలో తానే రాహుల్ గాంధీని ప్రధాని పదవి చేపట్టాలని ఒప్పించానని తెలిపారు. ప్రజలు ప్రస్తుతం 'స్విగ్గీ పాలిటిక్స్'ను కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీనే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇండియా కూటమి తరపున ఒక విధాన పత్రాన్ని ప్రజల ముందుంచి వారి తీర్పు కోరతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2024 నుంచి 2034 వరకు పదేళ్లపాటు కాంగ్రెస్కు ప్రజలు అధికారం కట్టబెడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ దశాబ్ద కాలం పాటు తాను తెలంగాణలోనే ఉంటానని, ఇక్కడి ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు.
తెలంగాణ జీడీపీని పదిశాతం పెంచేలా కృషి చేస్తానని, 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, ఆ తర్వాత తర్వాతి తరానికి అవకాశం ఇస్తానని చెప్పారు. అనంతరం, దేశానికి సేవ చేసే అవకాశం వస్తే, తన అనుభవాన్ని దేశం కోసం పంచుతానని, రాహుల్ గాంధీ తనకు అప్పగించే ఏ బాధ్యతినైనా స్వీకరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.











