(IDOC) (ప్రశ్న ఆయుధం) జూలై 04
కామారెడ్డి జిల్లా ఐడీఓసీ (IDOC)లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి, దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్. వై. గిరి కూడా హాజరయ్యారు.
దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా శనివారం కామారెడ్డి ఐడీఓసీ (IDOC)లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఆయన జ్యోతి ప్రజ్వలన గావించి, దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఎన్. వై. గిరి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికిన తొలి అమరవీరుడని అన్నారు. భూమి కోసం, పీడిత ప్రజల హక్కుల సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.
దొడ్డి కొమురయ్య త్యాగం, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నర్సయ్య, బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, జిల్లా అధ్యక్షులు భూమన్న, శ్రీనివాస్, చింతల శంకర్, జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, బహుజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.












