పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లు నిలుస్తున్నాయని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొని, వాటిని ప్రారంభించారు.
బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామంలో చికిలి లత శేఖర్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, నియోజకవర్గంలో అర్హత కలిగి ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బక్కూరి వినోదా, ఉపసర్పంచ్ బక్కూరి బుమేశ్వర్, బాల్కొండ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పబ్బరాజేష్, కిషన్ గౌడ్, ఇమ్రాన్, కాంగ్రెస్ మండల మైనారిటీ అధ్యక్షులు జావీద్, వార్డు సభ్యులు నాగులాపల్లి దేవేందర్, సాయన్న, ఆర్మూర్ రాజు, గాదేపల్లి రాజుతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












