మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలను పురస్కరించుకుని, ఆయన ఆశయాలు, కార్యాచరణ నేటికీ ఎంతో స్పూర్తిదాయకమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. చిట్కుల్ లోని ఆయన నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు.
నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే ఒక గొప్ప సామాజిక తత్వవేత్త, సంఘ సంస్కర్త అని, ఆయన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, సమానత్వ సాధన కోసం జీవితాంతం పోరాడారని తెలిపారు. ఆయన ఆశయాలు నేటికీ ఎంతోమందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
ముదిరాజ్ మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన, పూలే ఆశయాలకు అనుగుణంగా సంబండ వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా, దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ వంటి న్యాయబద్ధమైన డిమాండ్లపై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇది ప్రజల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూలే జీవితం, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.












