కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని వైకుంఠ దామాల పునరుద్ధరణ పనులకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరుతూ కౌన్సిలర్ల బృందం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి వినతి పత్రం సమర్పించింది.
పట్టణ పరిధిలోని వైకుంఠ దామాల పరిస్థితి దెబ్బతిన్నదని, ప్రజలకు అంత్యక్రియల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని కౌన్సిలర్లు వివరించారు. ఈ నేపథ్యంలో తక్షణమే మరమ్మత్తులు చేపట్టేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
కౌన్సిలర్లు సమర్పించిన వినతిని స్వీకరించిన షబ్బీర్ అలీ, సమస్యను సానుకూలంగా పరిశీలిస్తామని, సంబంధిత శాఖ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వైకుంఠ దామాల పునరుద్ధరణ పనులకు నిధులు మంజూరు చేయాలని కౌన్సిలర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.











