బిజెపి రాష్ట్ర నాయకురాలు Dr. బోగ శ్రావణి న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ను కలిసి, కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి (NH 563) పనుల పురోగతిని వేగవంతం చేయాలని కోరారు. ఈ రహదారి పనులు మందకొడిగా సాగుతున్నాయని, దీనివల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు.
Dr. బోగ శ్రావణి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు సమర్పించిన వినతిపత్రంలో, NH 563 పనుల ఆలస్యం వల్ల జగిత్యాల జిల్లా ప్రజలు కరీంనగర్‌కు ప్రయాణించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తరచుగా జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ రహదారి నిర్మాణం వేగవంతం కావడం వల్ల స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని, ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రమాదాల సంఖ్య కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.
వినతిపత్రం అందజేసిన అనంతరం, Dr. బోగ శ్రావణి మహిళా బిల్లు పై ప్రతిపక్షాల వైఖరిని విమర్శించారు. ప్రతిపక్షాలు ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ఆమె ఆరోపించారు.










