భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 14వ తేదీన ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో, ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వేడుకలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, హౌసింగ్ పీడీ వెంకట మాధవరావుతో కలిసి ఆవిష్కరించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, ఈ జయంతి వేడుకలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయని, అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలని, ఆయన స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సూచించారు.
ఈ వేడుకలలో వివిధ సంఘాల నాయకులు, అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.











