గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, శేరిలింగంపల్లి జోన్ నూతన డిప్యూటీ కమిషనర్ ఎస్లావత్ నాయక్‌ను కలిసి, డివిజన్ పరిధిలోని పలు కీలక ప్రజా సమస్యలపై చర్చించారు. నిర్మాణ పనుల వేగవంతం, డంప్‌యార్డ్ తరలింపు, క్రీడా మైదానాల అభివృద్ధి వంటి అంశాలపై ఆయన వినతి చేశారు.
శేరిలింగంపల్లి జోన్ నూతన డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎస్లావత్ నాయక్‌ను గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా, డివిజన్ పరిధిలోని పలు సమస్యలను డీసీ దృష్టికి తీసుకెళ్లారు.
గోపనపల్లి తండాలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి సంబంధించిన బోర్వెల్, కిచెన్, బాత్రూమ్, వాటర్ ట్యాంక్ పనులను త్వరగా పూర్తి చేయాలని గంగాధర్ రెడ్డి కోరారు. అలాగే, ఖాజాగూడలోని డంప్‌యార్డ్ వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, దానిని తొలగించి ప్రత్యామ్నాయ స్థలంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
యువతకు సౌకర్యాలు కల్పించేందుకు ఖాళీ క్రీడా మైదానాలను అభివృద్ధి చేయాలని సూచించిన గంగాధర్ రెడ్డి, చెరువుల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, రహదారుల మరమ్మతులు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై కూడా డీసీ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
డివిజన్లో పెండింగ్‌లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని గంగాధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో హనుమంతు నాయక్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.











