తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖా గోయల్ నియమితులయ్యారు. విజిలెన్స్ డీజీగా డీఎస్ చౌహాన్, మల్టీజోన్-2 ఐజీగా షానవాజ్ ఖాసిం బాధ్యతలు స్వీకరించారు. షానవాజ్ ఖాసింకు పోలీసు పర్సనల్ ఐజీగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.
ఫ్యూచర్ సిటీ కమిషనర్గా తరుణ్ జోషి, డ్రగ్స్ కంట్రోల్ డీజీగా అవినాష్ మొహంతిని ప్రభుత్వం నియమించింది. అవినాష్ మొహంతికి ఏసీబీ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు కూడా దక్కాయి.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి. సుమతి నియామకం అయ్యారు. ఐజీ కార్తికేయకు ఎస్ఐబీ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ బదిలీలు రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో కీలక మార్పులకు సూచికగా భావిస్తున్నారు.











