సంగారెడ్డి, జూలై 29
సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ బుధవారం బీఆర్ఎస్ యువ నాయకుడు శ్రవణ్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఇటీవల బైక్ ప్రమాదంలో గాయపడిన ఆయనను పరామర్శించారు. శ్రవణ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సంగారెడ్డి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు శ్రవణ్ రెడ్డి ఇటీవల బైక్ ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ బుధవారం ఆయన నివాసానికి వెళ్లి ఆత్మీయంగా పరామర్శించారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లిన ఎమ్మెల్యే శ్రవణ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.
ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. పరామర్శ అనంతరం శ్రవణ్ రెడ్డి ఇంట్లో ఉన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్తో మొదటిసారి ఎమ్మెల్యే అయిన తరువాత దిగిన ఫొటోను చూపిస్తూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే ఆప్యాయంగా మాట్లాడి, ఎలాంటి అవసరం వచ్చినా సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, వేణుగోపాల స్వామి, కౌన్సిలర్ లాడే మల్లేశం, 9వ వార్డు బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి లాడే బాలు, మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, విఠల్, పార్టీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మోహన్ సింగ్ నాయక్, వాజిత్, చింటూ, సంగమేష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.











