నిజామాబాద్, జూలై 25
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవీదేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గడి ప్రవీణ్‌కుమార్‌లు నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేశారు. జిల్లా యంత్రాంగం, అధికారులు, న్యాయవర్గ ప్రతినిధులు వారికి ఘన స్వాగతం పలికారు.
జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవీదేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గడి ప్రవీణ్కుమార్లకు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది.
ముందుగా న్యాయమూర్తులు స్థానిక రోడ్లు–భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకోగా, పోలీసు బలగాలు గౌరవ వందనం సమర్పించాయి.
అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరత లక్ష్మి, పోలీసు కమిషనర్ పి. సాయి చైతన్య, అదనపు కలెక్టర్ వి. భుజంగరావు, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందజేసి ఆహ్వానించారు.
తదనంతరం అతిథి గృహంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, పోలీసు కమిషనర్, అదనపు కలెక్టర్ తదితర ఉన్నతాధికారులతో హైకోర్టు న్యాయమూర్తులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా న్యాయవ్యవస్థ, పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై సమీక్ష నిర్వహించి, సంబంధిత వివరాలను తెలుసుకున్నారు.
హైకోర్టు న్యాయమూర్తుల జిల్లా పర్యటన సందర్భంగా అధికారులు, న్యాయవర్గ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై వారికి ఆత్మీయ స్వాగతం పలికారు.











