Site icon PRASHNA AYUDHAM

కామారెడ్డి గుమాస్తా కాలనీలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా

IMG 20251126 191217

కామారెడ్డి గుమాస్తా కాలనీలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా

పెళ్లి కావలసిన యువతి–యువకుల కోసం ప్రత్యేక పూజలు… భక్తుల భారీ హాజరు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 26 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గుమస్తా కాలనిలో గల శ్రీ కాలభైరవ, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీవల్లి–దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేదపండితుడు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో ఈ మహోత్సవం ప్రత్యేక పూజలతో ఘనంగా సాగింది.

పెళ్లి కావలసిన యువతి–యువకులు, సంతానం కోరుకునే దంపతులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్యకటాక్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వేదపండితుడు ఆంజనేయ శర్మ మాట్లాడుతూ, పెండ్లి కాకుండా ఉన్న యువతి–యువకుల కోసం ప్రత్యేక సుబ్రహ్మణ్య కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులకు ఏడాది లోపే శుభవార్తలు, శుభకార్యాలు సంభవిస్తాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మద్దెల వెంకటేశం, ప్రధాన కార్యదర్శి చిలప్రకాష్, కోశాధికారి భూషణ రాజశేఖర్, పైడి ఆంజనేయులు, కొక్కొండ బాల ప్రసాద్, నంగునూరి సందీప్, బుద్ధ రాజు, గైరా బోయిన సతీష్, రాజవరపు గురుమూర్తి, బచ్చు లింగం, క్యాదరి గణేష్, మోటూరి బైరయ్యతో పాటు కాలనీ మహిళలు, భక్తులు భారీగా పాల్గొన్నారు.

Exit mobile version